ఆ క్రేజీ సంస్థ చేతికి భర్త మహాశయులకి విజ్ఞప్తి ఓవర్సీస్ హక్కులు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఆశకా రంగనాథ్ , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గతంలో రవితేజ "కిలాడి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో డింపుల్ హయాతి , రవితేజ కు జోడిగా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా రవితేజ , డింపుల్ హయాతి జోడి కి మాత్రం ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.


ఇక ఈ సినిమాలో కూడా రవితేజ , డింఫుల్ హయతి కలిసిన నటిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే రవితేజ, డింపుల్ హయతి కలిసి ఉన్న ఒక పాటను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులను అమ్మి వేశారు. ఈ మూవీ కి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిర సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రత్యంగిర సంస్థ వారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt

సంబంధిత వార్తలు: