రికార్డులను తిరగరాసే కాంబో ఇది.. ఫిక్స్ అయితే మాత్రం 5000 కోట్ల కలెక్షన్స్ పక్క..ఆ దేవుడు కూడా ఆపలేడు..!
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరో సెన్సేషనల్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ గనుక నిజమైతే టాలీవుడ్ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా స్థాయిలోనూ ఇది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి కూడా చాలా సాలిడ్ స్టేజ్‌లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కాదు… తమిళ సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్‌తో, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేలు, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. పలు సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో భారీ ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న లోకేష్, ఇప్పుడు టాలీవుడ్‌పై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవలే లోకేష్ కనగరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసి ఒక పవర్‌ఫుల్ కథను వినిపించినట్లు సమాచారం. ఈ కథ పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేలా ఉండటమే కాకుండా, ఇద్దరు స్టార్ హీరోలకు సమానమైన ప్రాధాన్యం ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ విన్న అల్లు అర్జున్ ఫుల్‌గా ఇంప్రెస్ అయినట్లు, కథలోని కాన్సెప్ట్, పాత్రల తీరు తనకు బాగా నచ్చినట్లు ఇండస్ట్రీ టాక్.అయితే ఈ కథలో మరో కీలకమైన పాత్ర కూడా ఉందని, ఆ పాత్రకు తాను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను ఊహించుకున్నట్లు లోకేష్ అల్లు అర్జున్‌కు తెలిపాడట. ఈ విషయం విన్న వెంటనే అల్లు అర్జున్ కూడా ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎన్టీఆర్ గనుక ఆ పాత్రకు ఓకే చెబితే, తాను ఈ సినిమాను ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పినట్లు సమాచారం.
ఇక ఇప్పుడు అసలు గేమ్ మొదలైందని చెప్పాలి. లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాడట. ఎన్టీఆర్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వంటి హై-వోల్టేజ్ మల్టీస్టారర్‌లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవేళ ఈ లోకేష్ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన కెరీర్‌లో ఇది మూడో మల్టీస్టారర్ సినిమా అవుతుంది.ఇక అల్లు అర్జున్ – ఎన్టీఆర్ – లోకేష్ కనగరాజ్… ఈ ముగ్గురు కలయిక గనుక సెట్ అయితే, బాక్సాఫీస్ దగ్గర రికార్డులకు టెండర్లు పెట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇద్దరూ భారీ ఫ్యాన్‌బేస్ ఉన్న స్టార్ హీరోలు కావడం, పైగా లోకేష్ లాంటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే సినిమా స్థాయి వేరే లెవెల్‌కు వెళ్తుందని సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది. కొందరు అయితే 5 వేల కోట్లు పక్క అంటున్నారు. ఈ కాంబో గనుక ఫిక్స్ అయితే, టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది.