కాజల్ అగర్వాల్‌కు ఇన్ని కష్టాలు మొదలయ్యాయా.. ఏం జరిగింది..?
చందమామ స్టార్డమ్ టు గ్యాప్ :
అసలు విషయానికొస్తే, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఏ స్థాయి స్టార్‌డమ్‌ను అందుకున్నారో అందరికీ తెలిసిందే. అయితే, పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ కెరీర్లో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్‌కు ముందే ఆమె ఫామ్ కొద్దిగా తగ్గడంతో, రీఎంట్రీ తర్వాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్గా పాపులర్ అయిన కాజల్‌కు, రీఎంట్రీ తర్వాత అసలు అలాంటి పాత్రలే రాలేదు. ఫలితంగా, గత కొన్నేళ్లలో కాజల్ కెరీర్లో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేకపోయింది. సీనియర్ హీరోల సరసన సినిమాలు చేసినా అమ్మడికి ఆశించిన మంచి ఆఫర్లు దక్కలేదు. దీంతో, సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ అగర్వాల్ కెరీర్ కష్టాల్లో పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో, ఆమె ప్రస్తుతం కీలకమైన సహాయ పాత్రలు, ప్రయోగాత్మక రోల్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రంలో మండోదరి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, కాజల్ అగర్వాల్ 'విశాఖ' అనే ఒక వెబ్‌సిరీస్‌లో ముగ్గురు పిల్లల తల్లి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరోయిన్గా సరైన, సాలిడ్ అవకాశాలు రాకనే, సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ ఇలాంటి వైవిధ్యభరితమైన, సపోర్టింగ్ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి ప్రయోగాల ద్వారా అయినా కాజల్ బిజీగా మారి, నటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటారేమో చూడాలి.