విజయ్ పేరు మీద భజనా? ‘జన నాయకన్’పై ఇండస్ట్రీలో డేంజర్ టాక్!
అయితే, ఈ సినిమాలో రాజకీయ రిఫరెన్సులు ఉండటం వరకు ఓకే కానీ, అవి శ్రుతి మించితేనే ప్రమాదం. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక పుకారు సినిమా ఫలితాన్ని దెబ్బతీసేలా ఉంది.'జన నాయకన్' సినిమా చివర్లో, విజయ్ సినీ కెరీర్‌కు రౌండప్ ట్రిబ్యూట్‌గా 15 నిమిషాల పాటు ఒక స్పెషల్ ఎపిసోడ్ పెట్టారనే టాక్ బలంగా వినిపిస్తోంది.సరిగ్గా ఇదే ఇప్పుడు మేకర్స్ చేస్తున్న అతి పెద్ద రిస్క్ అని విశ్లేషకులు అంటున్నారు. 15 నిమిషాలు అనేది చాలా ఎక్కువ సమయం. అంతసేపు కేవలం హీరో ఇమేజ్‌ను ఎలివేట్ చేయడానికి, రాజకీయంగా హైప్ ఇవ్వడానికి వాడితే అది ప్రేక్షకులకు విసుగు తెప్పించే ప్రమాదం ఉంది.సినిమా కథ ఒక ఎమోషనల్ ఫ్లోలో, బలమైన పాయింట్‌తో వెళ్తున్నప్పుడు, సడెన్‌గా కథకు సంబంధం లేని ఇలాంటి 'వ్యక్తిగత భజన' కార్యక్రమాలు వస్తే ఆడియెన్స్ సినిమాతో డిస్‌కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అది సినిమా కోర్ పాయింట్‌ను దెబ్బతీస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' రీమేక్ అనే ప్రచారం బలంగా ఉంది. ఒక రీమేక్ కథను డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తోడు ఇప్పుడు ఈ ట్రిబ్యూట్‌ల పేరుతో కథను పక్కదారి పట్టిస్తే మొదటికే మోసం వస్తుంది. కథలో భాగం కాని అంశాలను బలవంతంగా ఇరికిస్తే ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది.జనవరి 9న విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఆ 15 నిమిషాల నివాళి ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందా, లేక విసిగిస్తుందా అనేదే ఇప్పుడు అసలైన సస్పెన్స్.ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే, విజయ్‌కు తిరుగులేని, ఎమోషనల్ సెండ్ ఆఫ్ దొరుకుతుంది. కానీ ఏమాత్రం తేడా కొట్టినా, ఆ ప్రభావం ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద పడే ఛాన్స్ ఉంది. 'జన నాయకన్' విజయ్ కెరీర్‌కు ఒక గ్లోరియస్ ఫేర్‌వెల్‌గా నిలుస్తుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.