స్టార్‌డమ్ కంటే మానవత్వం గొప్పది అని నిరూపించిన స్టార్ హీరోయిన్...!

Amruth kumar
బాలీవుడ్‌లో తన చిరునవ్వు, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకున్న నటి ప్రీతి జింటా గురించి చాలా మందికి తెలియని గొప్ప విషయం ఒకటి ఉంది. ఆమె కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఒక గొప్ప సామాజిక సేవను కూడా చేస్తున్నారు. ఆమె 34 మంది అనాథ బాలికలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటున్నారు.సెలబ్రిటీలు అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో రవీనా టాండన్, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ వంటి వారు పెళ్లికి ముందే పిల్లలను దత్తత తీసుకుని వార్తల్లో నిలిచారు. అయితే, పెళ్లికి ఏడు సంవత్సరాల ముందే ప్రీతి జింటా అంత పెద్ద సంఖ్యలో అనాథ బాలికలను దత్తత తీసుకుని వారి బాధ్యతలను తీసుకున్నారు.ప్రీతి జింటా 2009లో తన 34వ పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన బర్త్‌డేను మరింత ప్రత్యేకంగా మార్చుకునే క్రమంలో 34 మంది అనాథ బాలికలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ బాలికలందరి బాధ్యత తనదేనని ఆమె ప్రకటించారు. వారి చదువు నుంచి ఆహారం, దుస్తులు వంటి అన్ని అవసరాలను తనే సమకూరుస్తున్నారు.సంవత్సరానికి రెండుసార్లు ఆ పిల్లలను కలవడానికి రిషికేశ్‌కు వస్తానని కూడా అప్పట్లో ప్రీతి చెప్పారు.



 ప్రీతి జింటా 1998లో షారుఖ్ ఖాన్ చిత్రం 'దిల్ సే' తో సినీ కెరీర్‌ను ప్రారంభించింది (అందులో ఆమె చిన్న పాత్ర పోషించింది).ఆ తర్వాత 'క్యా కెహ్నా' చిత్రంలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.తెలుగులోనూ ఆమె మహేష్ బాబు సరసన 'రాజ కుమారుడు', వెంకటేష్ సరసన 'ప్రేమంటే ఇదేరా' వంటి చిత్రాలలో నటించారు.సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే, ఆమె 2016లో వివాహం చేసుకున్నారు.


వెండితెరపై తన నటనతో అలరించిన ప్రీతి జింటా, నిజ జీవితంలో 34 మంది బాలికలకు తల్లిగా మారి, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం అభినందనీయం. ఈ చర్య ఆమెకు అందంతో పాటు గొప్ప మనసు కూడా ఉందని నిరూపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: