2025 టాలీవుడ్: బాక్స్ ఆఫీస్ గ్రాస్ లో ఓజీ ఒక్కడే..?

Divya
2025 సంవత్సరానికి మరో కొద్ది రోజులలో గుడ్ బై చెప్పి 2026 కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ ఏడాది తమ చిత్రాలతో హిట్ ప్లాప్ సంబంధం లేకుండా సినిమా విడుదల చేశారు. డిసెంబర్ రెండో వారంలో బాక్సాఫీసు లెక్కలు కూడా దాదాపుగా ఖరారు అయ్యాయని చెప్పవచ్చు. రీసెంట్గా వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రమే ఈ నెలలో టాప్ గ్రాసర్ లిస్టులో ప్లేస్ సంపాదించుకుంది. ఎప్పుడు టాప్ లో ఉండే టాలీవుడ్ చిత్రాలు ఈ ఏడాది కొంత నిరాశ కలిగించే కనిపించాయి.


ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద కన్నడ సినిమా సత్తా చాటింది. ఆ చిత్రమే కాంతారా చాప్టర్ 1. ఈ సినిమా ఏకంగా రూ .853 కోట్ల రూపాయలు రాబట్టి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హిందీ సినిమా ఛావా రూ. 808 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈసారి టాప్ లిస్టులో కూడా బాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు సినిమాల పరిస్థితి వస్తే.. ఈసారి టాప్గ్10 లిస్ట్ జాబితాలో కేవలం పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం రూ.298 కోట్ల రూపాయలు వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. మిగిలిన భాషలలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు




ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బరిలో లేకపోవడంతో పెద్ద లోటుగా మారింది. ఎన్టీఆర్ బాలీవుడ్లో నటించిన వార్ 2 సినిమా కేవలం రూ .360 కోట్లు మాత్రమే కలెక్షన్స్ సాధించి పాప్ గా నిలిచింది. రజనీకాంత్ నటించిన కూలి రూ. 516 కోట్లు కాబట్టి యావరేజ్ గా నిలిచింది. పెద్ద సినిమాలు నిరాశపరిచిన చిన్న సినిమాలు మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సయారా సినిమా రూ. 575 కోట్లు రాబట్టింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి కొత్తలోక సినిమా రూ. 302 కోట్ల రాబట్టి అక్కడ సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే యానిమేషన్ ఫిలిం అయినా మహాఅవతార్ నరసింహ రూ. 326 కోట్లు రాబట్టింది. 2025 లో అత్యధిక గ్రాస్ వసూలు రాబట్టిన ఇండియన్ చిత్రాల విషయానికి వస్తే.

1). కాంతార చాప్టర్ 1: రూ.853కోట్లు
2). చావా: రూ.808 కోట్లు
3). సయారా: రూ.575 కోట్లు
4). కూలి: రూ.516 కోట్లు
5). ధురంధర్: రూ.374 కోట్లు ( థియేటర్లో ఇంకా ఆడుతోంది కనుక  పెరిగే అవకాశం ఉంది)
6). వార్ 2: రూ.360 కోట్లు
7). మహా ఆవతార్ నరసింహ: రూ.326 కోట్లు
8). లోక చాప్టర్1: రూ.326 కోట్లు
9).OG: 298 కోట్లు
10). హౌస్ ఫుల్ 5: రూ.292 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: