ఇప్పటి వరకు ఏ ఇండియన్ ఫిలింలో చూపించని డేర్ చేస్తున్న బన్నీ.. ఫ్యాన్స్ కి నరాలు కట్ అయిపోయే సర్ప్రైజ్..!

Thota Jaya Madhuri
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో అట్లీ ప్లాన్ చేస్తున్న ఓ క్రేజీ సీక్వెన్స్ గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.


అండర్ వాటర్‌లో అల్లు అర్జున్… ఊహకందని సీక్వెన్స్!

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అల్లు అర్జున్‌పై దర్శకుడు అట్లీ ఒక అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో చూసిన అండర్ వాటర్ సీన్స్‌కి ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతుందట. కథకు కీలకమైన ఈ ఎపిసోడ్‌ను విజువల్‌గా అద్భుతంగా చూపించేందుకు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ సీక్వెన్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తూ, అండర్ వాటర్ షూటింగ్‌లో నిపుణులైన హాలీవుడ్ టెక్నీషియన్స్ని ప్రత్యేకంగా తీసుకువచ్చి ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్యాంక్స్, అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్స్, వి ఎఫ్ ఎక్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నారని సమాచారం.


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లలో నీటితో సంబంధం ఉన్న విజువల్స్ కనిపించాయి. ఆ సమయంలోనే అభిమానులు ఈ సినిమాలో నీరు, అండర్ వాటర్ కాన్సెప్ట్‌కు సంబంధించి ఏదో స్పెషల్ ఉండబోతుందని ఊహించారు. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ లీక్‌లతో ఆ ఊహలకు బలం చేకూరుతోంది. ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే ఒక హైలైట్ ఎలిమెంట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాతో అల్లు అర్జున్ తన ఇమేజ్‌ను మరింత ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్‌లో తన ప్రత్యేకతను చూపించిన బన్నీ, ఈ సినిమాలో మాత్రం పూర్తి స్థాయి గ్లోబల్ హీరోగా కనిపించబోతున్నారని టాక్. ముఖ్యంగా ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారని సమాచారం.



ఈ భారీ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ అండర్ వాటర్ సీక్వెన్స్‌కు మరో లెవెల్ ఎలివేషన్ ఇవ్వబోతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్ట్‌ను కోలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మొత్తానికి అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా, ముఖ్యంగా ఈ అండర్ వాటర్ క్రేజీ సీక్వెన్స్‌తో థియేటర్లలో ఫ్యాన్స్‌కి నరాలు కట్ అయ్యేలా సర్ప్రైజ్ ఇవ్వబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా నుంచి మరిన్ని సంచలన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలో కూడా ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: