హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025 : వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం!
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, వారిద్దరి నటనకు మరియు పాత్రలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా విజయం వారి కెరీర్‌కు కూడా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్కు కామెడీ మరియు ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో మరోసారి సఫలమయ్యారు.
ఈ సినిమా సాధించిన సంచలన విజయమే అనిల్ రావిపూడికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించింది.
అనిల్ రావిపూడి తన రాబోయే సినిమాలతో మరిన్ని రికార్డులను తిరగరాయాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి కథానాయకుడిగా రాబోతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో వెంకటేష్ కూడా ఒక గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ తెరపై కనిపిస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు