అఖండ 2 : వరల్డ్ వైడ్ 4 డేస్ గ్రాస్ వసూళ్లు... బాలయ్య రికవరీ ఇదే... !
నందమూరి నటసింహ బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు సినీ జనాలు . .. తెలుగు సినీ ప్రేమికులలో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ - లెజెండ్ - అఖండ ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అఖండ సినిమా అయితే కోవిడ్ టైం లో తక్కువ రేట్ల తో వచ్చి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన అఖండ 2 తాండవం సినిమా మొన్న శుక్రవారం భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బాలకృష్ణకు జోడిగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి బోయపాటి శ్రీను అద్భుతంగా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రు . . 103 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న అఖండ 2 - తాండవం సినిమా ఫస్ట్ వీకెండ్ లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. .
సోమవారం కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్ లో వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజులు ముగిసేసరికి అఖండ 2 తాండవం సినిమాకు 167.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో 65% రికవరీ జరిగినట్టు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఇక టాక్ బాగుండడంతో మిగిలిన 35 శాతం అఖండ 2 ఎలా రికవరీ చేస్తుందో ? చూడాలి. గుంటూరు - సీడెడ్ - నైజాం ఏరియా లలో అఖండ కు ఇప్పటికే మంచి వసూళ్లు వచ్చాయి. .