హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఈ సంవత్సరంలో అలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన ఏకైక మూవీ "ది గర్ల్ ఫ్రెండ్".!

Thota Jaya Madhuri
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండగా, మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెట్టబోతున్న ఈ సందర్భంలో, గత ఏడాదిలో ఇండస్ట్రీకి, ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన అనేక విషయాలు మరోసారి సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డులు కూడా ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం విశేషం.



ఈ సినిమాలో రష్మిక మందన్న నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమెతో పాటు దీక్షిత్ శెట్టి అందించిన పర్ఫామెన్స్, అలాగే రావు రమేష్ నటన సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ, కథకు ప్రాణం పోసిన విధానం ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా ఫీల్ గుడ్ అంశాలతో, భావోద్వేగాలకు దగ్గరగా ఈ సినిమా సాగిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.బాక్సాఫీస్ పరంగా కూడా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా దాదాపు 27 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది నిజంగా ఒక గొప్ప రికార్డ్ అనే చెప్పాలి. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా తక్కువగా వచ్చిన నేపథ్యంలో, ఈ సినిమా సాధించిన విజయం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.



ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా మాత్రమే కాకుండా, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా కూడా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 2025లో విడుదలైన ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, సెన్సేషనల్ కలెక్షన్లు సాధించి ‘వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ హిట్’గా గుర్తింపు పొందింది. ఇది రష్మిక మందన్న కెరీర్‌కు నిజంగా ఒక బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.ఇక థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఓటిటిలో ఈ సినిమాను చూసి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలోనూ సినిమాపై పాజిటివ్ టాక్ కొనసాగుతుండగా, మరోసారి ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ట్రెండ్ అవుతోంది. మొత్తంగా, ఈ సినిమా రష్మిక మందన్న స్టార్‌డమ్‌ను మరింత బలపరిచిన చిత్రంగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: