హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025 : బాలయ్యలోని మరో కోణాన్ని పరిచయం చేసిన డాకు మహారాజ్!

Reddy P Rajasekhar
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'డాకు మహారాజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా, కలెక్షన్ల పరంగా కూడా రికార్డులను సృష్టించింది. బాలయ్య మాస్ ఇమేజ్‌కు బాబీ మేకింగ్ తోడవడంతో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత సినిమాలకు భిన్నంగా బాబీ ఈ చిత్రంలో బాలయ్యలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇక ఈ సినిమాలో ముగ్గురు భామలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా తమ నటనతో ఆకట్టుకోగా, చాందిని చౌదరి కీలక పాత్రలో నటించి మెప్పించారు.

సాంకేతికంగా కూడా సినిమా అత్యున్నత ప్రమాణాలతో ఉండటం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. మొత్తానికి 'డాకు మహారాజ్' విజయంతో బాలకృష్ణ ఈ ఏడాది తన ఖాతాలో ఒక క్లీన్ హిట్ వేసుకోవడమే కాకుండా, తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. బాలయ్య తాజాగా అఖండ2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలయ్య భవిష్యత్తులో మరిన్ని సంచలన రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: