15 ఏళ్ల నుంచి అలాంటి సమస్యతో అక్కినేని హీరో..?
నాగార్జున మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి తనకు తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అయినా కూడా తాను మోకాలు రీప్లేస్మెంట్ చేయించలేదని ,సర్జరీని అవాయిడ్ చేశానని తెలిపారు. ఆ నొప్పి తగ్గడానికి ల్యూబ్రికెంట్ ఫ్లూయిడ్ వాడానని , PRP చేయించడం వల్ల మోకాలి లోపల రీజనరేట్ అవ్వడానికి వైద్యులు కూడా హెల్ప్ చేశారని తెలియజేశారు. అయితే షూటింగ్ లేకున్నా , ఉన్నా కూడా ప్రతిరోజు తాను మోకాలి కోసం గ్యాప్ లేకుండా రిహాబ్ చేస్తూ ఉంటానని దాని మీదే వర్క్ చేశానని తెలిపారు. ఎప్పటినుంచో ఈ మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం అయితే తాను బాగానే ఉన్నానని తెలియజేశారు నాగార్జున.
నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. కుబేర, కూలి వంటి చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించారు. అలాగే తన 100 వ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి రా. కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి లాటరీ కింగ్ లేదా కింగ్ 100 టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో అఖిల్, నాగ చైతన్య అతిథి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుత బిగ్ బాస్ హోస్టుగా సీజన్ 9 కి వ్యవహరి స్తున్నారు.