గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అలాగే ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు కూడా అనేకం వచ్చాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం తెలుగు సినీ పరిశ్రమ నుండి భారీ సినిమాలు రాలేదు. ఈ సంవత్సరం ఐదు వందల కోట్ల వసూలు చేసిన ఒక్క సినిమా కూడా తెలుగు సినిమా పరిశ్రమ నుండి రాకపోవడం విశేషం. కానీ హిందీ సినిమా పరిశ్రమ నుండి శాండిల్విడ్ , కోలీవుడ్ నుండి మాత్రం ఈ సంవత్సరం 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు వచ్చాయి.
కానీ మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి మాత్రం 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం రాకపోవడంతో మరి కొంత కాలంలో విడుదల కాబోయే మన స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకొని 500 కోట్లకి పైగా కలెక్షన్లను వసూలు చేస్తే బాగుంటుంది అని లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రేజ్ కాస్త తగ్గే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.
ఇకపోతే ఈ సంవత్సరం హిందీ సినిమా పరిశ్రమ నుండి చావా , సియారా , దురంధర్ ఈ మూడు సినిమాలు కూడా 500 కోట్లకు మించిన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. దురంధర్ సినిమా ప్రస్తుతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక శాండిల్ వుడ్ నుండి కాంతారా చాప్టర్ 1 సినిమా ఈ సంవత్సరం 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో చేరిపోయింది. ఇక కోలీవుడ్ నుండి రజనీ కాంత్ హీరో గా రూపొందున కూలీ సినిమా 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా ఈ మూడు ఇండస్ట్రీ ల నుండి ఈ సంవత్సరం 500 కోట్లకు మించిన కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు వచ్చాయి.