కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను క్లోజ్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమ్మి వేసినట్లు ఓ ప్రముఖ సంస్థ ఈ మూవీ కి సంబంధించిన డిజిటల్ హక్కులను అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంబంధించిన డిజిటల్ హక్కులను జీ 5 ఓ టి టి సంస్థ ఏకంగా 52 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని వారాల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమాను జీ 5 ఓ టి టి సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాతో శ్రీ లీల కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే శ్రీ లీల కు తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కి అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.