తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చక చక పూర్తి చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఏకంగా 3 గంటల 06 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన పనులు అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాను అత్యంత భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ఈ మూవీ బృందం ఆలోచనకు వచ్చింది అనే వార్త బయటకు రావడంతో చాలా మంది మూడు గంటలకు మించిన రన్ టైమ్ అంటే సినిమాకు చాలా డేంజర్ అని , సినిమా ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉన్నట్లయితే 3 గంటలకి మించిన రన్ టైమ్ ఉన్న పర్లేదు కానీ సినిమాల్లో ఏ కాస్త బోర్ కొట్టే సన్నివేశాలు ఉన్నా కూడా మూడు గంటలకు మించిన రన్ టైమ్ ఆ సినిమాకు మైనస్ అవుతుంది అని , ఇక జన నాయగన్ అని సినిమా ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటే పర్లేదు కానీ భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టినట్లయితే సినిమా నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఎంత రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందో ..? ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ..? తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.