"త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు"..శోభిత ప్రెగ్నెన్సీ పై నాగార్జున ఫస్ట్ రియాక్షన్..!?

Thota Jaya Madhuri
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అదే శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్. అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్‌చల్ చేస్తోంది. అక్కినేని నాగార్జున త్వరలో తాత కాబోతున్నారంటూ వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాగార్జున ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ స్టార్ హీరో కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఈ న్యూస్ పై ఎక్సైట్ అయిపోతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, శోభిత ధూళిపాళ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే ప్రచారం జరుగుతుండగా, తాజాగా అఖిల్ అక్కినేని, జైనబ్ కూడా తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ వార్తలపై నాగచైతన్య–శోభిత, అఖిల్–జైనబ్ జంటలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లుగా సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.



ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగార్జునను ఈ విషయంపై యాంకర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఆధారంగా ఆమె నాగార్జున ను ప్ర్శనించింది.  ‘మీరు త్వరలో తాత కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా?’ అని అడగగా.. నాగార్జున కొంచెం సేపు సైలెంట్ అయ్యి..ఒక  చిరునవ్వుతో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం ఇప్పుడు హైలెట్ గా మారింది. "సరైన సమయం వచ్చినప్పుడు తానే అధికారికంగా ప్రకటన చేస్తానని చెప్పారు".

 

అంతే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాగార్జున ఇచ్చిన ఈ సమాధానంతో అక్కినేని కుటుంబంలో త్వరలోనే కొత్త ఏడాది సందర్భంగా ఒక వారసుడు లేదా వారసురాలు అడుగుపెట్టబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. నిజంగా ఆమె ప్రెగ్నెంట్ కాకపోయుంటే నాగ్ సైలెంట్ అయిపోయేవాడు..లేకపోతే నో అంటూ గట్టిగానే ఆన్సర్ ఇచ్చేవారు. కానీ ఆయన స్మైల్ తో కూల్ గా సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పారు. దీంతో  ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.  అక్కినేని ఇంట్లో సంతోషకరమైన వేడుకలు జరగబోతున్నాయన్న అంచనాలు మరింత బలపడుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి, అభిమానుల మధ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: