చాలా స్టైలిష్ గా నేషనల్ క్రష్ రష్మిక బ్యాచిలర్ పార్టీ.. మేడమ్ కి పెళ్లి కళ వచ్చేసింది..!

Thota Jaya Madhuri
నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న గురించి ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది. ఆమె ఇటీవల చేసిన ఒక చిన్న ట్రిప్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ముఖ్యంగా రష్మిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్తలు ఇప్పటికే వైరల్ అవుతుండగా, తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.రష్మిక ఫిబ్రవరి 26న హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకోబోతుందన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా అభిమానులు ఈ వార్తలను ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.


ఇలాంటి సమయంలో రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలతో పాటు ఆమె ఈ ట్రిప్‌ను “గర్ల్ ట్రిప్”గా పేర్కొనడం విశేషం. వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న తనకు కేవలం రెండు రోజుల చిన్న బ్రేక్ దొరికడంతో ఇలా ట్రిప్ ప్లాన్ చేశారట.  శ్రీలంక రిసార్ట్ లో బాగా ఎంజాయ్ చేశామని రష్మిక క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఫోటోల్లో రష్మిక బీచ్ వద్ద హాయిగా సేదతీరుతూ కనిపించింది. కొబ్బరి నీళ్లు తాగుతూ, సముద్ర తీరంలో నడుస్తూ, స్నేహితులతో నవ్వుతూ ఆనందంగా గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.



ప్రత్యేకంగా “వెల్కమ్ టు శ్రీలంక” అని ఉన్న బోర్డు దగ్గర నిలబడి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. ఈ ఫోటోల్లో ఎక్కడా పెళ్లి గురించి ప్రస్తావన రష్మిక చేయలేదు. కానీ ట్రిప్ టైమింగ్ చూసి అభిమానులు అనేక ఊహాగానాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో పెళ్లి జరగబోతుందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, కరెక్ట్‌గా ఒక నెల ముందు ఈ గర్ల్ ట్రిప్ ప్లాన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇది సాధారణ వెకేషన్ కావచ్చు లేదా చాలా ప్రైవేట్‌గా ప్లాన్ చేసిన బ్యాచిలరెట్ ట్రిప్ కావచ్చు అనే చర్చ జోరుగా సాగుతోంది.



కొంతమంది అభిమానులు అయితే ‘రష్మికకు పెళ్లి కళ వచ్చేసింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత విరామం మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమె ఆనందాన్ని, స్వేచ్ఛను, స్నేహితులతో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.ప్రస్తుతం రష్మిక చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: