ఆ విషయంలో డీప్ గా హర్ట్ అయిన జక్కన్న..‘వారణాసి’లో చిన్న ఛేంజ్!?
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. కథ, పాత్రలు, విజువల్స్, టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇండియన్ సినిమాకి న్యూ బెంచ్‌మార్క్ సెట్ చేస్తాయని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమా నుంచి ఏ చిన్న సమాచారం బయటకు వచ్చినా అది వెంటనే వైరల్ అయిపోతుంది.ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అదేంటంటే… ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశారనే వార్త. ఈ విషయం బయటకు రాగానే అది పెద్ద హైలైట్‌గా మారింది. ‘ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది’, అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ప్రకాష్ రాజ్ పేరు వినిపిస్తున్నప్పటికీ, ఈ పాత్రకు ఆయన ఫైనల్ కాదు అనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి జక్కన్న అభిప్రాయం ప్రకారం, మహేష్ బాబు తండ్రి పాత్రకు ఇంకెవరైనా నటుడు అయితే ఇంకా బాగా సూట్ అవుతారని ఆయన భావిస్తున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ప్రకాష్ రాజ్ పేరు ముందుకు వచ్చినట్టు సమాచారం.అందుతున్న లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం, ఈ విషయంలో రమా రాజమౌళి పాత్ర కూడా కీలకంగా ఉందట. కేవలం ఆమె సూచన లేదా అభిప్రాయం కారణంగానే ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు తండ్రి పాత్రకు ప్రకాష్ రాజ్‌ను ఆలోచనలో పెట్టినట్టు టాక్ నడుస్తోంది. కానీ ఆయన నటన పట్ల జక్కన్న డీప్ గా హర్ట్ అయ్యారట. అయితే నిజానికి రాజమౌళి మైండ్‌లో మాత్రం బాలీవుడ్‌కు చెందిన బిగ్ బడా స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారట.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన పాత్రను పూర్తిగా ఫిక్స్ చేయకుండా, ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారని సమాచారం. అవసరమైతే ఆయనను వేరే ఏదైనా కీలకమైన క్యారెక్టర్‌కు షిఫ్ట్ చేసి, మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవరికైనా అవకాశం ఇవ్వాలని జక్కన్న ప్రయత్నిస్తున్నారట. అంటే ఈ క్యాస్టింగ్ విషయంలో రాజమౌళి చాలా స్ట్రాటజిక్‌గా ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది.జక్కన్న అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అన్నది ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఆయన ప్లాన్ చేస్తే దానికి తిరుగు ఉండదు అని అభిమానులు గట్టిగా నమ్ముతారు. కథకు, పాత్రకు, మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగా ఆయన చేసే ప్లానింగ్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈసారి కూడా మహేష్ బాబు తండ్రి పాత్ర విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి మరింత పెరిగింది.
మొత్తానికి, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రకాష్ రాజ్ ఫైనల్ అవుతారా? లేక బాలీవుడ్ నుంచి ఎవరో బిగ్ స్టార్ ఎంట్రీ ఇస్తారా? అన్నది చూడాలి. జక్కన్న ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఈ క్యాస్టింగ్ సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. అప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు, చర్చలు మాత్రం ఆగేలా లేవు.