ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్ బన్నీకి చెల్లిగా నటిస్తోందా... ?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై టాలీవుడ్లోనే కాకుండా, ఇండియన్ సినిమా సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప 2' తర్వాత బన్నీ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కావడంతో, ప్రతి చిన్న అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి వినిపిస్తున్న ఒక ఆసక్తికర వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాలో టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇందులో బన్నీకి జోడీగా కాకుండా, ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర సినిమా కథలో చాలా కీలకమని, కథను మలుపు తిప్పే ఎంతో ఎమోషనల్ టోన్ ఉన్న రోల్ అని ఇండస్ట్రీ టాక్. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మృణాల్ , ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలో నటిస్తుండటం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
భారీ తారాగణం - పవర్ ఫుల్ స్క్రిప్ట్
అట్లీ ఈ సినిమా కోసం ఒక భారీ క్యాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ దీపికా పడుకోణె ప్రధాన హీరోయిన్గా నటిస్తుండగా, యువ నటి జాన్వీ కపూర్ మరో కీలక పాత్రలో మెరవనుంది. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఒక పవర్ఫుల్ డాన్ చుట్టూ తిరిగే కథను అట్లీ సిద్ధం చేశాడట. భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అట్లీ సినిమాల్లో గెస్ట్ రోల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా కోసం కూడా ఆయన పలువురు స్టార్ హీరోలను గెస్ట్ రోల్స్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు మరింత హైప్ ఇచ్చేలా ఈ పాత్రలను డిజైన్ చేస్తున్నారట. మొత్తానికి అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ను, అట్లీ స్టైలిష్ టేకింగ్‌ను కలిపి ఒక విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.