పాపం నిధి..ఫ్యాన్స్ తో చేదు అనుభవం..!
తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాదులోని లాలు మాల్ లో నిర్వహించారు. ఈవెంట్ కి నిర్మాత విశ్వప్రసాద్ తో పాటు డైరెక్టర్ మారుతి, సంగీత దర్శకుడు థమన్, ఎస్కేయన్ , నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వచ్చారు. అయితే అభిమానుల కొలహాల మధ్య ఈ సెకండ్ సాంగ్ ను విడుదల చేయగా ఈ వేడుక కాస్త విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ కావడంతో అభిమానులు తాకిడి ఎక్కువ అవ్వడంతో తోపులాట కూడా జరిగింది. దీంతో అనుకున్న దానికంటే కొంతముందుగానే ఈవెంట్ ని ఫినిష్ చేశారు.
కానీ ఈవెంట్ నుంచి నిధి అగర్వాల్ తిరిగి వెళుతున్న సమయంలో ఆమె పట్ల అభిమానులు చాలా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. నిధి ఈవెంట్ నుంచి కారు వద్దకు వెళుతున్న సమయంలో కొంతమంది ఆమెపై చేతులు వేస్తూ తాకడానికి ప్రయత్నించారు. అలా తనపైకి వచ్చిన వారిని ఆపలేక ఇబ్బంది పడిపోయినట్లు కనిపిస్తోంది నిధి. కొంతమంది కావాలనే ఇలాంటి దురుద్దేశంతో ఆమెను తాకేందుకు ప్రయత్నాలు చేశారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది కానీ మితిమీరి మరి ఇలా ప్రవర్తించే వారికి సెన్స్ ఉంటుందా ?అంటూ అభిమానుల పట్ల నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.