టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నితిన్ ఈ సంవత్సరం రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగి , ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి , ఎన్ని కోట్ల నష్టాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 2.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 75 లక్షలు , ఆంధ్ర లో 2.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 5.60 కోట్ల షేర్ ... 10.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 45 లక్షలు , ఓవర్ సిస్ లో 85 లక్షల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 6.90 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపు 28.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ సినిమాకు దాదాపు 21.60 కోట్ల రేంజ్ లో నష్టాలు వచ్చాయి. దానితో ఈ మూవీ ఈ సంవత్సరం భారీ ప్లాప్ లను అందుకున్న సినిమాల లిస్టు లో చేరిపోయింది. ఈ మూవీ లో నితిన్ కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ నటి మణులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.