ఇది రియల్ గేమ్ చేంజింగ్ మూమెంట్! మహేశ్ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఇండస్ట్రీలో కొత్త చాప్టర్ ప్రారంభం..!

Thota Jaya Madhuri
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా “వారణాసి” ఇప్పటికే ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారింది. గత నెల విడుదలైన గ్లింప్స్‌తోనే ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది ఈ సినిమా.ఇండియన్ సినిమా నుంచి రెండో ఐమ్యాక్స్ వెర్షన్ చిత్రంగా తెరకెక్కుతుండటం మాత్రమే కాదు, ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించే ఫస్ట్ ఎవర్ ప్లానింగ్తో “వారణాసి” రూపొందుతుండటం విశేషం. టెక్నికల్‌గా, విజువల్‌గా, కథా పరంగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా మేకర్స్ అత్యంత జాగ్రత్తగా ప్రతి అంశాన్ని డిజైన్ చేస్తున్నారు.



ఇటీవల డిజిటల్‌గా 1.43 రేషియోలో ఐమ్యాక్స్ వెర్షన్ ట్రైలర్‌ను ఐమ్యాక్స్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా రిలీజ్ చేసింది. ఇది ఒక చారిత్రక ఘట్టమని చెప్పాలి. ఈ తరహా డిజిటల్ రిలీజ్ ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని, ఇదే ఫస్ట్ ఎవర్ అటెంప్ట్ అని మేకర్స్ గర్వంగా ప్రకటిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటివరకు ఎవరూ ఊహించని ఎన్నో సాహసోపేతమైన ప్రయోగాలు ఈ సినిమాతో చేస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. ‘ఇండియా నుంచి ప్రపంచానికి మా కథను, మా విజన్‌ను పరిచయం చేస్తున్నాం’ అన్నదే “వారణాసి” టీమ్ ప్రధాన లక్ష్యం. కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమాకు గ్లోబల్ ఐడెంటిటీని మరింత బలంగా చాటే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. ప్రతి అప్డేట్‌తోనూ అంచనాలు పెంచుతూ, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది.



మొత్తానికి చూస్తే, “వారణాసి” ఇప్పటి  నుంచే పూర్తిస్థాయిలో పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న సినిమా అని స్పష్టంగా చెప్పొచ్చు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించనుందన్న నమ్మకం అభిమానుల్లో, సినీ వర్గాల్లో బలంగా కనిపిస్తోంది. చూడాలి మరి సినిమా రిలీజ్ కి లోపే రాజమౌళి ఇంకెన్ని సెన్సేషనల్ విషయాలని చూపిస్తాడో...??



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: