‘శంబాల’ షూటింగ్ లో గాయపడ్డ హీరో ఆది.. మూవీ కోసం ఇంత కష్టపడ్డారా?

Reddy P Rajasekhar

విజువల్ వండర్‌గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌లతో మేకర్లు ఆడియెన్స్‌ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్‌ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.

ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్‌లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్‌కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్‌ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.

‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్‌లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్‌లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్‌లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. డిసెంబర్ 25న శంబాల కచ్చితంగా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల అందించిన మ్యూజిక్, ఆర్ఆర్ మరో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇక ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: