నవాబులను ఎదిరించిన ఛాంపియన్.. ట్రైలర్ తో అదరగొట్టేసిన శ్రీకాంత్ కొడుకు..!

Divya
డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం డైరెక్షన్లో హీరోగా రోషన్ మేక, హీరోయిన్ గా అనస్వర రాజన్ జంటగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, గ్లింప్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటువంటి తరుణంలోనే చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.


ట్రైలర్ విషయానికి వస్తే.. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15- 1947 తర్వాత  బైరానాపల్లిలో 1948లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చేసుకొని ఈ కథను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అప్పట్లో ప్రజలను నిజాం నవాబుల కింద బానిసలుగా బతుకుతున్నట్టు చూపించారు. రోషన్ మేక ఇందులో ఫుట్ బాల్ ప్లేయర్గా, మెజీషియన్ గా కనిపిస్తారు. ఛాంపియన్ కావాలనే కోరికతో లండన్ వెళ్లాలనుకున్న హీరోకి.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. అదే సమయంలో తమ ప్రాంతాన్ని శాసిస్తున్న నవాబులను ఎదురించి తమ ఊరిని ఎలా కాపాడుకోగలిగాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ పర్ఫామెన్స్ తో రోషన్ అదరగొట్టేసాడని చెప్పవచ్చు.  ముఖ్యంగా అనస్వర , రోషన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇందులో అనస్వర డ్రామాలకు కథలు రాసే అమ్మాయి పాత్రలో నటించింది. నా కథలో నటించడానికి పాత్రులు కావాలబ్బాయ్ అంటూ ఆమె క్యూట్ గా అడిగే డైలాగ్స్ సినిమాకి మరో సరికొత్త అందాన్ని తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఇకపోతే ప్రతి డైలాగు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నవాబులు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనే విషయాన్ని తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక ఇందులోని ప్రతి అంశం కూడా ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకోబోతున్నట్లు చెప్పవచ్చు.  మొత్తానికైతే ఈ సినిమాతో రోషన్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం గ్యారెంటీ అని అభిమానులే కాదు సినీ విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తున్నారు. మరి రోషన్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: