ఆస్తి విషయంలో సమంత కఠిన నిర్ణయం..రాజ్ నిడమూరు సింగిల్ రూపాయి కూడా టచ్ చేసేందుకు లేదు..!?
వివాహం అనంతరం కూడా ఈ జంట పలుచోట్ల కలిసి కనిపిస్తూ సందడి చేయడం వల్ల సమంతకు సంబంధించిన వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత తన పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో ఓ కఠినమైన నిర్ణయం తీసుకుందట అనే వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ఆమె తన ఆస్తిలో ఎలాంటి వాటా కూడా భర్త రాజ్ నిడమూరుకు దక్కకుండా ముందుగానే పక్కా అగ్రిమెంట్ రాయించుకుందని కథనాలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది. గతంలో సమంత వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలే ఆమెను ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేశాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మహిళగా, స్టార్‌గా తన ఆస్తిని తానే కాపాడుకోవాలనే ఆలోచనతో సమంత ఇలా చేసిందేమో అని కూడా కొందరు అంటున్నారు.
ఇదే తరహాలో గతంలో హీరోయిన్ నయనతార పెళ్లి సమయంలో కూడా ఇలాంటి వార్తలే కోలీవుడ్‌లో హైలైట్ అయ్యాయి. నయనతార తన పేరుపై ఉన్న ఆస్తిని పూర్తిగా సురక్షితంగా ఉంచేందుకు, ఎవరికీ దక్కకుండా ఒకపక్క వీలునామా రాసిందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే తరహా నిర్ణయాన్ని సమంత కూడా తీసుకుందన్న వార్త రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.సమంత, నయనతార ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో, నయనతార ఇచ్చిన సలహాతోనే సమంత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే సమంత ఎందుకు ఆస్తి విషయంలో ఇంత కఠినంగా ఆలోచించిందన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశమే.
ఇక మరోవైపు, ఈ నిర్ణయం కొంతవరకు మంచిదే అయినా, రాజ్ నిడుమూరు ..సమంతను నిజంగా ప్రేమిస్తే ఇలాంటి అగ్రిమెంట్లు అవసరం లేదని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. మరోవర్గం మాత్రం, ఇది పూర్తిగా సమంత వ్యక్తిగత విషయం, ఆమెకు ఉన్న హక్కు అని మద్దతు తెలుపుతున్నారు.మొత్తానికి, ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన (ఆఫీషియల్ అనౌన్స్మెంట్) మాత్రం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ బాగా బాగా ట్రెండ్ అవుతోంది. నిజం ఏంటన్నది కాలమే తేల్చాలి. అప్పటివరకు ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హాట్ టాపిక్‌గా మాత్రమే మిగిలిపోతుంది.