కేవలం జుట్టు వల్ల అవకాశాలు కోల్పోయిన ప్రభాస్ హీరోయిన్..!

Divya
ఇండియన్ సినీ ప్రపంచంలో హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ,హిందీ ,తమిళం వంటి భాషలలో నటించి బాగానే ఆకట్టుకుంది .ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని తెలుగులో అతి తక్కువ సమయంలోనే ప్రభాస్, రవితేజ, గోపీచంద్ తదితర హీరోల చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి తన జుట్టు వల్ల తాను సినిమా అవకాశాలు కోల్పోయానని తెలియజేసింది. వాటి గురించి చూద్దాం.


తాప్సీ మాట్లాడుతూ.. కెరియర్ మొదట్లో ప్రతి దర్శకుడు తన జుట్టు స్ట్రెయిట్ చేయించుకోమని సలహా ఇచ్చారు. చాలా కాలం వరకు దర్శక నిర్మాతలు స్టైలిష్ లుక్ అంటే కేవలం స్ట్రెయిట్ హెయిర్ కలిగి ఉన్న వారు మాత్రమే అని ఆలోచనతో ఉండేవారు.. రింగుల జుట్టు ఉంటే అది కేవలం రెబల్ రూల్స్ అని భావించారు, అందుకే అలాంటి రింగుల జుట్టు కలిగి ఉన్న అమ్మాయిలు పాజిటివ్ పాత్రలకు పనికిరారనే ఆలోచనతో ఉండే వారిని తెలిపింది. కెరియర్ ప్రారంభంలో తనకి కూడా అవకాశాలు రాకపోవడంతో , తన జుట్టుని స్ట్రెయిట్ చేయించుకోవడానికి అంగీకరించాను. ఆ తర్వాత సినిమాలే కాకుండా బ్రాండ్ యాడ్స్ కూడా తన జుట్టు స్ట్రెయిట్ చేయించుకోవాలని చెప్పడంతో యాడ్స్ వదిలేసానని తెలిపింది.


అందమైన జుట్టు అంటే రింగుల జుట్టు కాదనే వారిని, దీంతో ఒకానొక సమయంలో చాలా నిరాశ కూడా పడ్డానని, చిన్న వయసులో నా జుట్టు మీద  నాకే అసహ్యించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని, ఆ తర్వాత పెరిగేకొద్దీ  నెమ్మదిగా తన జుట్టు పైన కేర్ తీసుకొని ముందుకు వెళ్లానని తెలిపింది తాప్సి. తాప్సి చివరిగా అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే అనే చిత్రంలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: