సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించిన విజయ్..ఫ్యాన్స్ మీసాలు మెలివేసే న్యూస్ ఇది..!
ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా, బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ నుంచి ప్రేరణ పొందిన కథాంశంతో రూపొందుతోంది. సామాజిక అంశాలతో పాటు పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ ఘట్టాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార కంటెంట్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన యూకే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, బుకింగ్స్‌కు లభించిన స్పందన సినీ చరిత్రలోనే అరుదైనదిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, జన నాయగన్ 24 గంటల్లోనే 12.7 వేలకుపైగా టికెట్లు విక్రయించి, తమిళ సినీ పరిశ్రమలో ఆల్‌టైమ్ రికార్డ్‌ను సృష్టించింది. ముఖ్యంగా, ఈ రికార్డు గతంలో విజయ్ నటించిన చిత్రాలకే పరిమితమవడం విశేషం.
ఇంతకుముందు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ చిత్రం 24 గంటల్లో సుమారు 10 వేల టికెట్లు అమ్మి యూకేలో రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే రికార్డును విజయ్ నటించిన ‘జన నాయగన్’ అధిగమించడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇది విజయ్ మార్కెట్ స్టామినా, ఆయనపై ప్రేక్షకులకు ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ బలమైన ఓపెనింగ్ ట్రెండ్ చూస్తుంటే, ప్రేక్షకులు విజయ్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఆయన చివరి సినిమాను చరిత్రాత్మక విజయంగా మలచాలనే అభిమానుల సంకల్పం అడ్వాన్స్ బుకింగ్స్‌లో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.