ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా ఆ పాన్ ఇండియా స్టార్..ఇక జనాలు టీవికి ఫెవికాల్ లా అత్తుకునిపోతారు పో..!
ప్రత్యేకంగా కళ్యాణ్, తనూజ మధ్య విన్నర్ రేస్ చాలా హీట్‌గా సాగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే రెండు వర్గాలు ఏర్పడి, ‘కళ్యాణ్‌దే కప్పు’ అని కొందరు, ‘కాదు తనూజే విన్నర్’ అని మరికొందరు తెగ చర్చలు చేస్తున్నారు. ఓటింగ్ ట్రెండ్స్‌ని చూస్తే కూడా కళ్యాణ్, తనూజ ఇద్దరూ పోటాపోటీగా ముందుకు దూసుకుపోతున్నారు. బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం కళ్యాణ్‌కు కొద్దిగా ఆధిక్యం ఉందని అంటున్నారు. అయితే చివరి నిమిషంలో బిగ్ బాస్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.ఇక అసలు హాట్ టాపిక్‌కి వస్తే… బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలేకు గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారు అన్నదే ఇప్పుడు అందరి ఆసక్తి. గత సీజన్లను పరిశీలిస్తే, ఫినాలే ఎపిసోడ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు నిర్వాహకులు ఓ బిగ్ సెలబ్రిటీని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా విన్నర్‌ను అనౌన్స్ చేయించే బాధ్యతను ఓ స్టార్ చేతిలో పెట్టడం సంప్రదాయంగా మారింది.
గతంలో బిగ్ బాస్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు మూడు సీజన్లలో చిరంజీవి స్టేజ్‌పైకి వచ్చి విన్నర్‌ను ప్రకటించడం ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఓ సీజన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి విజేతను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరు వస్తారన్నదానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈసారి బిగ్ బాస్ టీమ్ ఎవ్వరూ ఊహించని ఓ పాన్ ఇండియా స్టార్‌ను ఫినాలే స్టేజ్‌పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోందట. ఆ స్టార్ మరెవరో కాదు… రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడూ బిగ్ బాస్ స్టేజ్‌పైకి రాలేదు. అందుకే ఈ వార్త నిజమైతే అది సీజన్ 9కి హైలైట్‌గా మారడం ఖాయం.
ఇదిలా ఉండగా, ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ సినిమా జనవరి 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ప్రభాస్‌ను బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలేకు గెస్ట్‌గా పిలిచారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఆహ్వానానికి డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఎపిసోడ్ రికార్డ్ స్థాయిలో టీఆర్‌పీ సాధించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ స్టేజ్‌పైకి రావడం అంటే టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకుల దృష్టి కూడా ఈ ఫినాలేపై పడే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం ఇవన్నీ కేవలం ప్రచారమేనని, అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదని గమనించాలి. బిగ్ బాస్ టీమ్ గానీ, ప్రభాస్ టీమ్ గానీ ఇప్పటివరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో, నిజంగా ప్రభాస్ ఫినాలేకు వస్తాడో లేదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.ఒకవేళ ప్రభాస్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 9 కప్పు అందజేయబడితే, ఆ ఘట్టం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఆ కప్పు ఎవరి చేతుల్లోకి వెళ్లబోతోంది? కళ్యాణ్‌కా, తనూజాకా, లేక ఇంకెవరైనా ఊహించని ట్విస్ట్ ఉంటుందా? అన్నదానికి సమాధానం త్వరలోనే తెలియనుంది.