బిగ్ బాస్ 9: విజేత ఎవరు? గెలిచిన వారికి ప్రైజ్ మనీతో పాటు ఇంకేం రానున్నాయంటే..?
టాప్ 5 కంటెస్టెంట్లు తనూజ, డిమాన్ పవన్, సంజన ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. చివరి టాప్ 2 ప్లేస్ లో ఇద్దరు నిలిచే వారిలో ఒకరు విన్నర్ గా ప్రకటిస్తారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తి అవ్వగా ఇందులో కళ్యాణ్ టాప్-5హ లో ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సారి ఫిమేల్ విజేతగా తనూజ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ విన్నర్ కు కాసులు వర్షం ఈ సారి కురువనుంది. బిగ్ బాస్ 9 ప్రైజ్ మనీ రూ. 50 లక్షల రూపాయలు అందుతుంది. అలాగే దీంతో పాటు హౌస్ లో ఉన్న రోజులకు అనుగుణంగానే కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ కూడా ఉంటుందట. అంటే విన్నర్ కు ఈ రెండు కలిపి భారీ మొత్తంలో అందుతున్నట్లు సమాచారం.
అలాగే ప్రైజ్ మనీతో పాటు, రెమ్యూనరేషన్ తో పాటు, స్పాన్సర్ అందించేటువంటి బహుమతులు( బంగారు, ప్లాట్, కారు) కూడా వస్తాయి. గత సీజన్లో విజేతలకు కూడా ఇలాంటి బహుమతులు అందుకున్నారు. కాబట్టి ఈసారి కూడా టైటిల్ ఎవరు గెలిచిన వారికి కాసుల వర్షమే అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో గ్రాండ్ ఫినాలిలో కంటెస్టెంట్స్ కు బంపర్ ఆఫర్ ఇస్తూ ఉంటారు. టైటిల్ వదులుకొని బయటకు వెళ్లే కంటెస్టెంట్స్ సైతం భారీ మొత్తంలో లభిస్తుంటాయి. అలా కొన్ని సార్లు రూ. 40 లక్షల వరకు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈసారి టైటిల్ విన్నర్ ఎవరో చూడాలి.