గుర్రం పాపిరెడ్డి రివ్యూ: కామెడీతో నవ్వించారా..?

Divya
నరేష్ అగస్త్య ,ఫరియా అబ్దుల్లా, యోగి బాబు, బ్రహ్మానందం, జీవన్, డైరెక్టర్ మురళీమోహన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రం క్రైమ్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవతార్ -3 వంటి చిత్రాలు విడుదలైన (డిసెంబర్9) న విడుదలైన గుర్రం పాపిరెడ్డి సినిమా ఎలా ఉందో చూద్దాం.


స్టోరీ:

గుర్రం పాపిరెడ్డి (నరేష్ ఆగస్త్య), అలాగే సౌదామినిగా (ఫరియా అబ్దుల్లా)  మరో ముగ్గురు గ్యాంగ్ తో కలిసి శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకువచ్చి శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో ఉండే మరొక శవం ప్లేస్ లోకి మార్చాలని ప్లాన్ వేస్తారు. అసలు వారు తీసుకొచ్చిన ఆ శవం ఎవరిది? ఎందుకు మార్చాలి అనుకున్నారు. ఆ సమయంలో రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర)లు అసలు గుర్రం పాపిరెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? గుర్రం పాపిరెడ్డి ఎవరు? పైగా వాళ్ళ ఆస్తి ఎందుకు కొట్టేయాలని చూస్తారు అనేది ఈ సినిమా కథ.


ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ఆకట్టుకున్న అంశాలు ఉన్నాయి అంటే అక్కడక్కడ నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. డైరెక్టర్ ప్రతి పాత్రను కూడా డిజైన్ చేసిన విధానం వారి చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను నవ్వు తెప్పిస్తాయి. మొదటి భాగంలో  కామెడీ హైలెట్ గా ఉంది.

నటుడు జీవన్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు మించి ఈ సినిమాలో చేసిన గొయ్యి పాత్రలోని, అమాయకత్వం తన నటనతో అందరిని ఆకట్టుకుంది. మిలట్రీ పాత్రలో రాజ్ కసిరెడ్డి ఆకట్టుకున్నారు. యోగి బాబు ఫన్నీ సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే నటుడు నరేష్ అగస్త్య కి డీసెంట్ రోల్ అని చెప్పవచ్చు. తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లా తన పాత్రలో అద్భుతంగా నటించింది. అటు గ్లామర్ తో పాటు ఆమె చేసిన పాత్ర కూడా హైలెట్ గా ఉంది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ సీన్స్ కి ఎలాంటి దోకా లేదు, ఇందులో వచ్చే ట్విస్టులు కూడా కాస్త డీసెంట్ గానే కనిపిస్తాయి.


మైనస్:
సినిమా స్టోరీ మాత్రం సాగతీతంగా ఉన్నది. ఈ విషయంలో డైరెక్టర్ మరింత కేర్ తీసుకోవాల్సింది.

సినిమా మొదలై ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు ఫుల్ కామెడీతో నడిచే సినిమా ఆ తర్వాత కథలో బలం లేదనిపిస్తుంది.


కొంత రొటీన్ స్టోరీనే అనిపించిన సినిమా చూస్తున్నంతసేపు నవ్వకుండా ఉండలేరు. ఫన్ థ్రిల్లర్ సీన్స్ చూస్తే గత చిత్రాలలోని సీన్స్ గుర్తు రాక మానవు.


అలాగే అనుకోకుండా వచ్చే కొన్ని సాంగ్స్ తీసేసి ఉండాల్సింది.

యోగిబాబు వంటి కమెడియన్ ని పెట్టుకొని తక్కువగా వాడేసుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే బ్రహ్మానందం వంటి కమెడియన్ తో మరింత కామెడీ సీన్స్ చేసి ఉంటే బాగుండేది.

మొత్తానికి సినిమా చూసి నవ్వుకోవాలనే వారికి ఈ సినిమాని ట్రై చేయొచ్చు.


రివ్యూ రేటింగ్:
2.75/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: