హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఏడాది అభిమానులను నిరాశపరిచిన హీరోలు వీళ్లే..?
యంగ్ హీరో నిఖిల్ ఏడాదికి రెండు చిత్రాలైన విడుదల చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. నిఖిల్ స్వయంభు, ది ఇండియన్ హౌస్ వంటి చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరి వచ్చే ఏడాది స్వయంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మరో హీరో అడవి శేషు: వరుస విజయాలతో బిజీగా ఉన్న అడవి శేషు ప్రస్తుతం డెకాయిట్ , గూడచారి 2 వంటి చిత్రాలలో నటించారు. డికాయిట్ చిత్రం ఈ ఏడాది విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడుతోంది. G2 సినిమా కూడా వచ్చేయేడాదే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు.
మెగా హీరో సాయిదుర్గ తేజ్ కూడా 2023లో విరూపాక్ష, బ్రో వంటి చిత్రాలతో అలరించిన ఈ మెగా హీరో ఈ ఏడాది కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు సినిమాలో నటించారు. అది కూడా వచ్చేయేడాది రిలీజ్ కాబోతోంది.
మరో మెగా హీరో వరుణ్ తేజ్.. చివరిగా మట్కా సినిమాతో ఘోరమైన డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ప్రస్తుతం హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా చూస్తున్నారు.
.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించలేదు. విశ్వంభర సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ కారణం చేత పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. మన శంకర వరప్రసాద్ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చేయేడాదికి సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో అలరించారు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే అల్లు అర్జున్, నవీన్ పోలిశెట్టి తదితర హీరోలు ఏడాది సినిమాలో విడుదల చేయకుండా అభిమానులను నిరాశపరిచారు.