టాలీవుడ్
ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో
మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక తన తోటి సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి
బాలకృష్ణ ,
నాగార్జున ,
వెంకటేష్ లతో పోలిస్తే ఓ విషయంలో
చిరంజీవి ఈ సంవత్సరం చాలా వెనకబడ్డాడు. అదేంటి అనేది తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ...
మెగాస్టార్ చిరంజీవి 2023 వ సంవత్సరం భోళా
శంకర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ఈ
సినిమా తర్వాత
చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాలు
సంక్రాంతి కానుకగా విడుదల చేయలేకపోయారు.
ఇప్పటికి కూడా ఈ
సినిమా విడుదల కాలేదు. ఇక
చిరంజీవి "విశ్వంభర"
మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర
ప్రసాద్ గారు అనే సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు ప్రకటించారు. దీనితో
చిరంజీవి 2023 వ సంవత్సరం భోళా
శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన తర్వాత 2024 వ సంవత్సరం
చిరంజీవి నుండి ఒక్క
సినిమా రాలేదు. 2025 వ సంవత్సరం కూడా
చిరంజీవి నుండి ఒక్క
సినిమా రాలేదు. ఇక తన తోటి సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి
బాలకృష్ణ ,
వెంకటేష్ ,
నాగార్జున మాత్రం తమ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి తమ అభిమానులను బాగా ఆకట్టుకున్నారు.