పవర్ స్టార్ పవన్ గత కొన్ని సంవత్సరాలుగా ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చాడు. కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సమయాన్ని సినిమాలకు కేటాయించలేక ఎక్కువ శాతం రీమిక్ సినిమాలను చేస్తూ వచ్చాడు. దానితో ఆయనకు విజయాలు దక్కిన కూడా ఫాన్స్ లో ఎక్కడో చిన్న పాటి అసహనం. తమ అభిమాన నటుడు రీమిక్ సినిమాలలో కాకుండా కొత్త కథతో సినిమాలు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాంటి సమయం లోనే పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాలను స్టార్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా కొత్త కథతో తెరకెక్కనున్నట్లు వార్తలు రావడంతో పవన్ అభిమానులు అద్భుతమైన రేంజ్ లో ఖుషి అయ్యారు. కానీ ఈ రెండు సినిమాల షూటింగ్లు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఈ సినిమాలో షూటింగ్లు డిలే అవుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యాయి.
ఇందులో హరిహర వీరమల్లు సినిమా ఈ సంవత్సరం మొదట విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. కానీ పవన్ చాలా కాలం తర్వాత రీమిక్ సినిమాలో కాకుండా కొత్త కథతో రూపొందిన సినిమాలో నటించడంతో పవన్ అభిమానులు చాలా ఆనంద పడ్డారు. ఇకపోతే కొంత కాలం క్రితం పవని నటించిన ఓజి సినిమా విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో పవన్ ను చూపించిన విధానానికి సుజిత్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సంవత్సరం పవన్ రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడంతో ఈయన అభిమానులు అదిరిపోయే రేంజ్ లో ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.