బాలయ్య ఆఖరి ఐదు సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. ఆ మూవీలను దాటలేకపోయినా అఖండ 2..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన ఆఖరి ఐదు మూవీ లకు మొదటి వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. వారం రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 60.23 కోట్ల షేర్ .. 102.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

బాలకృష్ణ కొంత కాలం క్రితం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మొదటి వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల షేర్ ... 119.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

బాలకృష్ణ కొంత కాలం క్రితం భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి మొదటి వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 55.09 కోట్ల షేర్ ... 98.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి.

బాలకృష్ణ కొంత కాలం క్రితం గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 68.51 కోట్ల షేర్ ... 114.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 53.49 కోట్ల షేర్ ... 87.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: