పోటీకి సిద్ధమైన మహేష్.. రవితేజ.. ఫైనల్ గెలుపు ఎవరిదో..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి మహేష్ బాబు , రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలు మరి కొన్ని రోజుల్లో పోటీ పడే అవకాశాలు కనబడుతున్నాయి. అది ఎలా అనుకుంటున్నారా ..? వీరిద్దరూ కూడా రీ రిలీజ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు , కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆ సమయం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని మరి కొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 31 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
 


ఇకపోతే మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటించగా ... వి వి వినాయక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కూడా మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమాను కూడా డిసెంబర్ నెలలో కనుక రీ రిలీజ్ చేసినట్లయితే మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి , రవితేజ హీరో గా రూపొందిన కృష్ణ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో భాగంగా తలపడే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: