రాజాసాబ్: ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ సిద్ధం..?

Divya
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజా సాబ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించగా, హర్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతోంది. ఇందులో మాళవికా మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్ విడుదల చేసిన చిత్ర బృందం పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా సినిమాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది.


అదేమిటంటే ఈ నెల 27వ తేదీన రాజా సాబ్ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను  చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గతంలో విడుదలైన ట్రైలర్లో ప్రభాస్ లుక్స్, కామెడీ టైమింగ్ కూడా అభిమానులను కట్టిపడేసింది. సినిమా విడుదల సమయంలో అంచనాలను మరింత పెంచేసేలా ఇప్పుడు కొత్త  ట్రైలర్ ని రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ అవుతోంది.


ఇటీవల నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్ విడుదల చేయించారు. ఇలా వరుస ప్రమోషన్స్ ను ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ మరో ట్రైలర్ సిద్ధంగా ఉందని తెలిసి ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. మొదటిసారిగా ప్రభాస్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో అనే విషయం తెలియాలి అంటే జనవరి 9వ తేదీ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: