"ఆయనే నా గురూజీ"..ఆ తెలుగు హీరో కి చేతులు ఎత్తి దండం పెట్టిన సమంత..!
ఇదిలా ఉండగా, సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘అత్తారింటికి దారేది’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సమంతతో పాటు ప్రణీత సుభాష్ కూడా కీలక పాత్రలో నటించింది.ఈ సినిమాకు సంబంధించిన ఓ పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ సమంతను ఆశీర్వదిస్తున్నట్లు కనిపించే ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో, గతంలో సమంత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై తన గౌరవాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేసింది. “పవన్ కళ్యాణ్ నాకు గురువులాంటి వారు. స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో సరదాగా తీసిన ఫోటో అది. పవన్ నటుడు కాకపోయి ఉంటే, ఆయన్నే నా గురువుగా ఉండాలని కోరుకునేదాన్ని. ఈ సినిమాలో ఆయనతో పని చేయడం వల్ల నాకు మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఆయన ప్రవర్తన ఎంతో వినమ్రంగా ఉంటుంది. ఎవరికైనా తిట్టాల్సి వచ్చినా కూడా చాలా మర్యాదగా, హుందాగా మాట్లాడతారు” అంటూ సమంత చెప్పుకొచ్చింది.
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అవి మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మాటలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సమంత–పవన్‌ల మధ్య ఉన్న పరస్పర గౌరవం, సాన్నిహిత్యం మరోసారి అందరికీ గుర్తొస్తోంది.మొత్తానికి, సమంత చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.