చిరు-శ్రీకాంత్ ఓదెల మూవీలో హీరోయిన్ ఎవరో తెలుసా..? కుర్రాళ్లకి పిచ్చెక్కించే ఫిగర్..!
ఇక ఈ సినిమా పూర్తైన వెంటనే చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ (బాబీ కొల్లి) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక అప్డేట్ వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అయితే, వీటితో పాటు మరో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై కూడా మెగాస్టార్ అభిమానుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చేయనున్న సినిమా. ‘దసరా’ సినిమాతో తన టాలెంట్‌ను నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా కి సంబంధించి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి కీలక విషయాలను వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, ఈ సినిమాను 2026 సంవత్సరం ప్రధమార్థం తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉందట. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.అంతేకాదు, ఈ సినిమాలో చిరంజీవిని ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని విధంగా సరికొత్త కోణంలో శ్రీకాంత్ ఓదెల ప్రెజెంట్ చేయనున్నారని నిర్మాత స్పష్టం చేశారు. మెగాస్టార్ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నమైన షేడ్‌లో పాత్ర ఉంటుందని, ఈ సినిమా చిరంజీవి కెరీర్లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీంతో శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపిస్తాడా? ఈ సినిమాతో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఎంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో హాట్ టాపిక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే హీరోయిన్ ఎంపిక. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ తమన్నాను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి – తమన్నా కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉండటంతో, ఈ వార్త అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది.
అలాగే, గతంలో చిరంజీవి మరియు తమన్నా మధ్య ఉన్న మంచి స్నేహబంధం కారణంగానే ఆమెకు ఈ సినిమాలో అవకాశం దక్కిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్ నిజమైతే సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అవుతాయని చెప్పవచ్చు.మొత్తంగా చూస్తే, అనిల్ రావిపూడి సినిమా, బాబీ ప్రాజెక్ట్, అలాగే శ్రీకాంత్ ఓదెల సినిమా — ఇలా వరుసగా ఆసక్తికరమైన చిత్రాలతో మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు ఫుల్ మీల్స్ విందు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెలతో సినిమా మాత్రం చిరంజీవిని పూర్తిగా కొత్త అవతారంలో చూపించనుండటంతో, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.