"అసలు బన్నీ తెలుగు హీరోనే కాదు"..యంగ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్.!
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనస్వర రాజన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆ సందర్భంగా ఆమె తెలుగు సినీ పరిశ్రమ గురించి, ఇక్కడి హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అనస్వర మాట్లాడుతూ, మలయాళంలో డబ్ అయిన అల్లు అర్జున్ సినిమాలు తాను చాలా ఎక్కువగా చూసేదాన్నని తెలిపింది. అయితే అప్పట్లో అల్లు అర్జున్ ఒక తెలుగు హీరో అన్న విషయం తనకు తెలియదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. “నిజానికి అప్పట్లో అల్లు అర్జున్ను మలయాళ హీరోనే అనుకున్నాను. ఆయన సినిమాలు మలయాళంలో విపరీతంగా ప్రసారం అవుతూ ఉండేవి. అందుకే ఆయన మలయాళ ఇండస్ట్రీకే చెందిన హీరో అని భావించాను” అని అనస్వర నవ్వుతూ చెప్పింది.
అలాగే, రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమా చూసిన తర్వాతే నాకు తెలుగు సినిమాలపై, తెలుగు హీరోలు, నటీనటులపై అవగాహన పెరిగింది అని ఆమె కామెంట్స్ చేసింది. ‘మగధీర’ సినిమా తనపై ఎంతో ప్రభావం చూపిందని, ఆ సినిమా తర్వాతే తెలుగు ఇండస్ట్రీని సీరియస్‌గా గమనించడం ప్రారంభించానని అనస్వర చెప్పుకొచ్చింది.నిజానికి అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మలయాళ రాష్ట్రంలో అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాదు, అక్కడ ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఆర్మీ కూడా ఉందని టాక్ వినిపిస్తుంటుంది. అలాంటి హీరోను మలయాళ హీరో అనుకున్నాను అని అనస్వర చెప్పడంతో నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం అల్లు అర్జున్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌కు ఇది మరో ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, ‘ఛాంపియన్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న అనస్వర రాజన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆమెకు మరింత పబ్లిసిటీ తీసుకొచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.