వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ , చిరంజీవి హీరోగా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు , రవితేజ హీరోగా రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి , శర్వానంద్ హీరోగా రూపొందుతున్న నారీ నారీ నడుమ మురారి , నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇకపోతే ఈ ఐదు సినిమాలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు ఇప్పటికే ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ ఐదు సినిమాలకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ల వివరాలను తెలుసుకుందాం.
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 నుండి 220 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు దాదాపు 90 నుండి 100 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 45 నుండి 55 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 35 నుండి 45 కోట్ల వరకు ప్రీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు 25 నుండి 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల కాబోయే ఈ ఐదు సినిమాల కు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.