అఖండ 2 యూనిట్ ప్లాన్ కి ఆనందంలో బాలయ్య ఫ్యాన్స్.. కలెక్షన్స్ ఏమైనా పెరిగేనా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గతంలో బాలయ్య , బోయపాటి కాంబోలో రూపొందిన సింహా , లెజెండ్ , అఖండ సినిమాలు మంచి విజయాలను సాధించి ఉండడం , ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో అఖండ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది.


అయినా కూడా ఈ మూవీ కి మంచి ఓపెనింగ్లు లభించాయి. కానీ ఈ మూవీ కి మొదటి వీక్ డే నుండి కలెక్షన్స్ భారీ గా డ్రాప్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా కలెక్షన్లు తగ్గిన వేళ అదిరిపోయే రేంజ్ ప్రమోషన్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం డిసెంబర్ 24 వ తేదీన ఈ మూవీ బృందం వారు భారీ ఎత్తున సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నట్లు , దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా బృందం వారు పెద్ద ఎత్తున సక్సెస్ మీట్ను నిర్వహించి దానికి పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా తీసుకువస్తే ఈ సినిమా కలెక్షన్లు కాస్త పెరిగే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: