నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాజాగా అఖండ 2 అనే మూవీ రూపొందింది. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈ మూవీ ని డిసెంబర్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 11 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను పెద్ద ఎత్తున చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్స్ వివరాలను ... మొత్తంగా 8 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 11 వ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక మొదటి రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 8.76 కోట్లు , మూడవ రోజు 9.24 కోట్లు , నాలుగవ రోజు 2.56 కోట్లు , ఐదవ రోజు 1.73 కోట్లు , ఆరవ రోజు 1.14 కోట్లు , ఏడవ రోజు ఒక కోటి , 8 వ రోజు 1.02 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రీమియర్స్ మరియు ఎనిమిది రోజులతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 50.70 కోట్ల షేర్ ... 81.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రీమియర్స్ మరియు మొదటి మూడు రోజుల పాటు మంచి కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. కానీ నాలుగవ రోజు నుండి ఈ సినిమా కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా డ్రాప్ అయ్యాయి. ఇక ఏడవ రోజుతో పోలిస్తే 8 వ రోజు ఈ సినిమా కలెక్షన్లు కాస్త పెరిగాయి.