స్టార్ హీరోయిన్ కి యాక్సిడెంట్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

Divya
బాలీవుడ్ లో హీరోయిన్ గా పేరు సంపాదించిన నోరా ఫతేహీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, షేర్ , ఊపిరి, మట్కా చిత్రంలో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. తన గ్లామర్ తో కుర్రాలని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ నిన్నటి రోజున (డిసెంబర్ 20) ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ కారు ప్రమాదానికి ముఖ్య కారణం నోరా ఫతేహీ డ్రైవర్ వినయ్ మద్యం సేవించినట్లుగా ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ ప్రమాదంలో హీరోయిన్ నోరా ఫతేహీ కి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గోవాలో జరిగేటువంటి సన్ బర్న్ ఫెస్టివల్ కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వినయ్ ను పోలీసుల అదుపులోకి తీసుకొని అతడి పైన డ్రంక్ అండ్ డ్రైవ్, రేస్ డ్రైవింగ్ పైన కేసు నమోదు అయినట్లుగా పోలీసులు తెలియజేశారు. వైద్య పరీక్షల అనంతరం నోరా ముంబైలో జరిగిన ఫెస్టివల్ కి హాజరైంది.  ఇందుకు సంబంధించిన ఒక ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం పైన నోరా ఫతేహీ ఎలా స్పందిస్తుందో చూడాలి. నోరా సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది రష్మిక నటించిన థామా అనే చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించింది. ప్రస్తుతం ది డెవిల్, కాంచన 4 వంటి చిత్రాలలో నటిస్తోంది. బుల్లితెరపై హిందీ బిగ్ బాస్ సీజన్ 9 లో  పాల్గొన్న ఈమె 9వ స్థానంలో ఉన్నది.


మరొకవైపు కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు వెనుక వైపు నుంచి మరొక కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ,అయితే  ఈ ప్రమాదంలో హీరో శివ కార్తికేయనుకు కూడా ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: