వారణాసి: బడ్జెట్ పై నోరు విప్పిన ప్రియాంక చోప్రా.. ఎన్ని కోట్లంటే..?

Divya
ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం ఇప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్న సినిమా వారణాసి. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించగా మహేష్ బాబు హీరోగా నటిస్తూ, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఈ చిత్రం భారతీయ ఇతిహాసమైన రామాయణం కథ ఆధారంగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేసి విడుదల చేశారు రాజమౌళి. అందుకే ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న న్యూస్ అయినా సరే క్షణాలలో వైరల్ గా మారుతోంది.

ఇటీవల హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ వారణాసి సినిమా పైన చేసిన కామెంట్స్ ట్రెండీగా మారాయి. గ్లోబ్ ట్రాటర్ , టైమ్ ట్రాటర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా పైన తాజాగా ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఈ సినిమా వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో వారణాసి సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ .1300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలియజేసింది. బడ్జెట్ విషయంపై ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రెండిగా మారుతున్నాయి. కానీ వారణాసి సినిమా రెండు భాగాలుగా ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేదు.



మొదట ఈ సినిమా మొదలైనప్పుడు రూ .1000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటూ వార్తలు వినిపించాయి. అన్ని కోట్లతో తెరకెక్కిస్తున్నారని తెలియడంతో ఇండస్ట్రీ ని షేక్ చేస్తుందని చాలామంది స్టార్ మేకర్స్  సైతం ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్స్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2027లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి విడుదలకు ముందే ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: