బిగ్ బాస్ 9: సంజన 15 వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?
కానీ ఎవరు ఊహించని విధంగా టాప్ 5 కంటెస్టెంట్లలోఒకరిగా నిలిచింది సంజన. దీంతో ఈమె హౌస్ లో 15 వారాలకు గాను విన్నర్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వినిపిస్తోంది. టాప్ 5 కంటెస్టెంట్లలో 5 స్థానంలో ఉండి ఎలిమెంట్ అయ్యింది. సంజన ఒక్కో ఎపిసోడ్ తో ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా నామినేషన్ సమయంలో రీతూ, డిమాన్ స్నేహం గురించి మాట్లాడడంతో ఈమె పేరు హాట్ టాపిక్ గా మారింది. వీరి విషయంలో ఈమె హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యింది. అయినా చివరికి చేసేదేమీ లేక రిక్వెస్ట్ చేసి మరి సారీ చెప్పించారు.
అయితే ఆ ఒక్క ఎపిసోడ్ తో సంజన క్రేజ్ మారిపోయింది. ఆ క్రేజీ ఆమెను టాప్- 5కు తీసుకువచ్చేలా చేసిందని ఆడియన్స్ తెలియజేస్తున్నారు. సంజన 15 వారాలకు గాను మొత్తం రూ .42 లక్షలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపుగా ఈమెకు వారానికి రూ.2.80 లక్షల బిగ్ బాస్ చెల్లించినట్లుగా వినిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ విన్నర్ కి ఇచ్చే రూ .50 లక్షలు ప్రైస్ మనీ రేంజ్ లో సంజన పారితోషకం తీసుకుందని వినిపిస్తోంది.