తెలుగు సినిమా పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ కాంబినేషన్లలో విజయ భాస్కర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాకు కథ , మాటలు , డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించాడు అంటే చాలు ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే ఆలోచనకు తెలుగు ప్రేక్షకులు వచ్చేసారు. అంత స్థాయిలో వీరి కాంబినేషన్ జనాల్లో ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఇకపోతే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా ... ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. బ్రహ్మానందం , సునీల్ , ఎమ్ ఎస్ నారాయణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , స్క్రీన్ ప్లే , మాటలను అందించాడు. ఇకపోతే ఈ సినిమాను 2026 జనవరి 1 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
విజయ భాస్కర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో నువ్వే కావాలి అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అంతటి బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమా తర్వాత విజయ భాస్కర్ , త్రివిక్రమ్ కలిసి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నారు. ఇక స్రవంతి రవి కిషోర్ ఆ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ "నువ్వే కావాలి" లాంటి బ్లాక్ పాస్టర్ తర్వాత మూడు నెలల సమయం తీసుకుని నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథను రెడీ చేశాడు. ఆ కథను విజయ భాస్కర్ , స్రవంతి రవి కిషోర్ లకి త్రివిక్రమ్ శ్రీనివాస్ వినిపించగా వారిద్దరు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాను ఎవరితో చేయాలి అనుకునే సమయంలో సురేష్ బాబు , రవి కిషోర్ కు బాగా క్లోజ్ కావడంతో వెంకటేష్ కు ఫస్ట్ వినిపిద్దాం అని ఆలోచనకు వచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ , వెంకటేష్ కి కథ వినిపించగానే వెంకటేష్ సింగిల్ సిట్టింగ్లోనే కథను ఓకే చేశాడు. ఆ తర్వాత చక చక వేరే పనులు కూడా ముగిసాయి. ఫుల్ స్పీడ్ లో ఈ సినిమాను కంప్లీట్ చేసేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ ఆయిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.