హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025 : "తండల్"తో చందు మండేటి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడుగా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో చందు మండేటి ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన కార్తికేయ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీలో నిఖిల్ హీరో గా నటించగా ... స్వాతి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో చందు మండేటి కి దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆ సినిమాలు కార్తికేయ స్థాయి విజయాన్ని అందుకోలేదు. అలాంటి సమయం లోనే ఈయన నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తికేయ 2 అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.


ఈ సినిమా ద్వారా చందు మండేటి కి ఇండియా వ్యాప్తంగా గుర్తుకు వచ్చింది. కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత చందు మండేటి ఎవరితో సినిమా చేస్తాడు ..? ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తాడు ..? అని ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూశారు. అలాంటి సమయం లోనే ఈ దర్శకుడు నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్గా తండెల్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా మత్స్యకారుల నేపథ్యం లో రూపొందింది. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తండెల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన చందు మండేటి ఈ సంవత్సరం కూడా తండల్ మూవీ తో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: