యంగ్ లుక్ కోసం బాలయ్య స్పెషల్ న్యూ వర్కౌట్ ? ఫ్యాన్స్ ఇంప్రెస్..!

Thota Jaya Madhuri
నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాను ప్రముఖ నిర్మాత సతీష్ కిలారు నిర్మిస్తుండగా, తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.ఈ సినిమాలోని ఓ కీలకమైన స్పెషల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ యంగ్ గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ యంగ్ లుక్ కోసం ప్రస్తుతం బాలయ్య ప్రత్యేకంగా కసరత్తులు మొదలుపెట్టారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శరీర దారుఢ్యం, ఫిట్‌నెస్, లుక్—అన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుతూ రోజూ వర్కౌట్స్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ యంగ్ గెటప్ ప్రేక్షకులకు విపరీతమైన థ్రిల్ ఇచ్చేలా ఉంటుందని టాక్. బాలయ్యను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఈ గెటప్ ఉంటుందని తెలుస్తోంది.

 

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో కొంత హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ మహారాజుగా కనిపించనుండగా, ఆయన పాత్రకు భారీ ఎలివేషన్లు, పవర్‌ఫుల్ సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. పీరియాడిక్ టచ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై గోపీచంద్ మలినేని ఫుల్ ఫోకస్ పెట్టి, ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.



ఈ చిత్రంలో హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుంది. బాలకృష్ణ – నయనతార కాంబినేషన్ మరోసారి వెండితెరపై కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ సినిమాపై గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తోనే ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.



నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇది 111వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇప్పటికే అనేక మైలురాయి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బాలయ్య, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్, పీరియాడిక్ కథాంశం, పవర్‌ఫుల్ పాత్ర, యంగ్ గెటప్—ఈ అన్ని అంశాలు కలిసివచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మొత్తానికి, బాలయ్య అభిమానులకు ఇది నిజంగా ఓ పండగలా మారనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: