"హిందువులారా.. ఇకనైన మేల్కోండి".. స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ సెన్సేషనల్ పోస్ట్‌ వైరల్‌..!

Thota Jaya Madhuri
ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ఒక దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. బంగ్లాదేశ్‌కు చెందిన దీపు చంద్రదాస్ అనే హిందూ వర్కర్‌ను అమానుషంగా కొట్టి, అనంతరం చెట్టుకు కట్టేసి కాల్చివేసిన సంఘటన మానవత్వాన్ని సైతం కుదిపేసింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం అవుతూ ప్రజల్లో ఆగ్రహాన్ని, ఆవేదనను రేకెత్తిస్తున్నాయి.ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఘటనపై స్పందిస్తూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, అక్కడి హిందూ మైనారిటీల భద్రతపై తన ఆందోళనను ఆమె వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన  వీడియోను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఈ దారుణంపైకి తీసుకురావాలని ప్రయత్నించారు.



కాజల్ అగర్వాల్ తన పోస్ట్‌లో ఎంతో తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ స్పందించారు. “హిందువులారా.. మేల్కోండి.. మౌనం మిమ్మల్ని రక్షించదు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా “All eyes on bangladesh Hindus” అనే క్యాప్షన్‌ను కూడా జోడించి, బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.


ఈ పోస్ట్ వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికగా విస్తృత స్పందన వచ్చింది. కొందరు కాజల్ ధైర్యంగా ఈ అంశంపై మాట్లాడినందుకు ఆమెను అభినందిస్తుండగా, మరికొందరు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ, సామాజిక కార్యకర్తలు సైతం ఈ అంశంపై స్పందిస్తూ, మానవ హక్కుల ఉల్లంఘనపై గళమెత్తుతున్నారు. సాధారణంగా సినీ ప్రముఖులు ఇలాంటి సున్నితమైన అంతర్జాతీయ అంశాలపై స్పందించడంలో వెనుకడుగు వేస్తారని భావించే పరిస్థితుల్లో, కాజల్ అగర్వాల్ చేసిన ఈ పోస్ట్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె స్పందన కేవలం ఒక సెలబ్రిటీ అభిప్రాయంగా మాత్రమే కాకుండా, ఒక మానవతావాది ఆవేదనగా పలువురు అభివర్ణిస్తున్నారు.



మొత్తంగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ దారుణ హత్య, దానిపై కాజల్ అగర్వాల్ చేసిన తీవ్ర స్పందన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తూ వైరల్ అవుతోంది. ఈ ఘటన మతం, మానవ హక్కులు, మైనారిటీల భద్రత వంటి అంశాలపై సమాజం మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: