ఆది ని పరీక్ష పెడుతున్న క్రిస్మస్ !
ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ వారం క్రిస్మస్ వేడుకలను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్నశంభాల విడుదలకు ముందే ఓటిటి డీల్ పది కోట్లకు క్లోజ్ చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పరిమిత బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ తో ఒక విలేజ్ థ్రిల్లర్ రూపొందించిన ఈమూవీ పై ఆది సాయి కుమార్ చాల ఆశలు పెట్టుకున్నాడు.
ఈమధ్య కాలంలో థ్రిల్లర్ మూవీలు బాగుంటే ప్రేక్షకులు బాగ్ చూస్తున్న నేపధ్యంలో ఈమూవీ తనకు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆది భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీతో ‘ఛాంపియన్’ ‘ఈషా’ ‘దండోరా’ ‘అనకొండ’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఆది సినిమాకు గట్టిపోటీ కనిపిస్తోంది. మూఢ నమ్మకాలు రాజ్యమేలే ఒక గ్రామంలో ఉల్కాపాతం పడి దాని పరిణామాలు తీవ్రంగా మారుతున్న సమయంలో దెయ్యాలంటే నమ్మకం లేని ఒక యువకుడుగా ఆది ఈసినిమాలో నటిస్తున్నాడు.
అందరు యంగ్ హీరోలు నటిస్తున్న ఈ చిన్న సినిమాల వార్ లో ఆది విజయం సాధించ గలిగితే మళ్ళీ అతడి కెరియర్ ఒక దారిన పడే ఆస్కారం ఉంది. మరి ఈ క్రిస్మస్ రేస్ కు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. వచ్చేనెల సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత భారీ సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో ఇన్ని చిన్న సినిమాలు ఎంతవరకు సంక్రాంతి వరకు నిలబడగలుగుతాయి అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఇన్ని చిన్న సినిమాల మధ్య ఆది సాయి కుమార్ కు శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన ‘ఛాంపియన్’ గట్టి పోటీ ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది.